Friday, July 17, 2015

బాహుబలి పార్ట్-2 స్టోరీ ఇదేనా?


బాహుబలి పార్ట్-2 స్టోరీ ఇదేనా?



అమరేంద్ర బాహుబలి (పెద్ద ప్రభాస్), బళ్లాలదేవ (రాణా) ఇద్దరూ దేవసేన(అనుష్క)ను ఇష్ట పడతారు. దేవసేన (అనుష్క) మాత్రం బాహుబలిని ఇష్ట పడుతుంది. దీంతో రాజ్యం కావాలా? ప్రేమ కావాలా? అని బాహుబలిని అడిగితే 'ప్రేమే' కావాలనుకుని దేవసేన (అనుష్క)తో కలసి రాజ్యం విడిచి బాహుబలి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి దేవసేన (అనుష్క), బాహుబలి (పెద్ద ప్రభాస్) ప్రేమ, పెళ్లి, వాళ్ళ కాపురం, దేవసేన (అనుష్క) గర్భవతి కావడం జరుగుతుంది. అదే సమయంలో మాహిష్మతి రాజ్యాన్ని పాలిస్తున్న బళ్లాల దేవ (రాణా) ప్రజల్ని హింసలు పెడుతూ వుంటాడు. ప్రజల్లోనూ అతడి పాలన మీద తీవ్ర అసంతృప్తి రగులుతుంది. అదే అదునుగా భావించి కాలకేయ తమ్ముడు (చరణ్ దీప్) మహిష్మతి రాజ్యం మీద దండెత్తుతాడు. అప్పుడు మాహిష్మతి ఓడిపోయే స్థితికి వస్తుంది. విషయం తెలుసుకున్న 'బాహుబలి' యుద్దంలో పాల్గొని తమ రాజ్యాన్ని కాపాడుతాడు. అటు బాహుబలికి కట్టప్ప చేత వెన్నుపోటు పొడిచేలా బిజ్జలదేవ (నాజర్), బళ్లాల దేవ (రాణా) కలసి కుట్ర పన్నుతారు. బాహుబలిని చంపేస్తారు. అటు దేవసేన (అనుష్క) మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను చంపేందుకు బిజ్జలదేవ (నాజర్), బళ్లాల దేవ (రాణా)ప్రయత్నిస్తారు. శివగామి (రమ్యకృష్ణ) వాళ్ల ప్రయత్నానికి అడ్డుపడి, వాళ్ళతో పోరాడుతుంది. ఎలాగోలా వాళ్ల నుంచి తప్పించుకోని ఆ బిడ్డ 'శివుడు'(చిన్న ప్రభాస్)ని గూడెం వాసులకు దొరికేలా చేస్తుంది. ఇక్కడి వరకు జరిగిన కథతో సినిమా ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అవుతుంది. గతాన్ని తెలుసుకున్న శివుడు తన బలగం అయిన కట్టప్ప సైన్యంతో పాటు , అవంతిక (తమన్నా) సైన్యం, అస్లంఖాన్ (సుదీప్ ) సహకారంతో బళ్ళాల దేవ (రాణా) మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో బళ్ళాలదేవ (రాణా) ఓడిపోతాడు. అతడ్ని దేవసేన (అనుష్క) పేర్చిన పుల్లల చితి మీద బ్రతికి వుండగానే కాలుస్తారు. దీంతో బాహుబలి రెండవ భాగానికి శుభం కార్డు పడుతుంది!

No comments:

Post a Comment