ఆవు గుండె కణజాలంతో మనిషికి జీవం….
చావుబతుకులతో కొట్టుమిట్టాడిన వృద్ధురాలికి గోవు పునర్జన్మనిచ్చింది. ఆవు గుండె నుంచి తయారు చేసిన కవాటాల్ని ఓ వృద్ధురాలికి అమర్చి ఆధునిక వైద్యశాస్త్రంలో నూతన అధ్యాయానికి తెరలేపింది చెన్నై ఫ్రంటియర్ హాస్పిటల్.హైదరాబాద్‌కు చెందిన అల్లూరి సీతాయమ్మ అనే 81ఏళ్ల వృద్ధురాలికి చెన్నై ఫ్రాంటియర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. ఆవు గుండె నుంచి తయారుచేసిన కవాటాలు ఆమెకు అమర్చారు. వాల్వా ఇన్ వాల్వా ట్రాన్ స్కాథెటర్ ఎరొటిక్ వాల్వా రీప్లెస్‌మెంట్ (వీఐవీ-టీఎవీఆర్) అనే విధానంలో చికిత్సను విజయవంతం చేసినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.. మహాధమని పూడుకుపోవడంతో 11 ఏళ్ల క్రితం ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. కొంతకాలం బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.
రెగ్యులర్ చికిత్సకు విరుద్ధమైన, చాలా ప్రమాదకరమైనా చికిత్సను చెన్నై వైద్యులు ఎంతో ధైర్యంగా చేశారు. ఆమెకు ఆవుగుండె టిష్యూస్ నుంచి తయారుచేసిన అమర్చి ఆమెను బ్రతికించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది.
గోమాతను పూజించాల్సిన కొందరు కబేళాలకు తరలించి .. చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాను చనిపోయినా.. ఎన్నోరకాలుగా మనుష్యులకు ఉపయోగపడుతున్న గోమాత.. ఇప్పుడు తన గుండె కవాటాల్ని ఇచ్చి మనిషికి ప్రాణం పోసింది.
No comments:
Post a Comment