OMG !!! An egg with a tail.. :-o
బ్రహ్మం గారు చెప్పినట్లే తోక ఉన్న కోడి గుడ్డు పుట్టింది..!
కోడి కి తోక ఉంటుంది.. కోడి పిల్లకు తోక ఉంటుంది. మరి కోడి గుడ్డుకు తోక ఎప్పుడైనా చూసారా? కోడి గుడ్డుకు తోక ఎక్కడా ఉండదేమో గాని.. పచ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేముల దీవిలో మాత్రం ఉంటుంది. ఆ గ్రామంలో తోక తో ఉన్న కోడిగుడ్డు అందరిని షాక్ కి గురి చేస్తుంది. వేముల దీవి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఒక కోడి ని పెంచుకుంటున్నాడు. ఆ కోడి తోక ఉన్న ఒక గుడ్డు పెట్టింది. గుడ్డుకు తోక ఉండడం చూసి వెంకటేశ్వర్లు నోరు వెల్ల బెట్టాడు.
ఆ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకింది. ఇంకేముంది. తోక ఉన్న గుడ్డును చూడడానికి గ్రామస్తులంతా వెంకటేశ్వర్లు ఇంటికి చేరుకున్నారు. అయితే ఇది బ్రహ్మం గారు ముందే చెప్పారని అంటున్నారు. ఈ సంఘటన వలన ఉరికి ఏదైనా అయిష్టం జరుగుతుందేమో అని బయపడుతున్నారు. దీనితో గ్రామ పెద్దలంతా కలసి విచిత్రమైన ఈ గుడ్డును రామాలయం లో ఉంచి పూజలు చేస్తున్నారు.
No comments:
Post a Comment